: కెప్టెన్ గా ఆఖరి రోజు ధోనీ ఏం చేశాడంటే..!

బుధవారం నాడు మహేంద్ర సింగ్ ధోనీ, భారత క్రికెట్ జట్టు కెప్టెన్సీ పదవిని వదిలేస్తున్నట్టు సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అసలు నిన్న ధోనీ ఏం చేశాడు? ఎందుకింత సడన్ గా ఇటువంటి నిర్ణయాన్ని తీసుకున్నాడు? సౌరవ్ గంగూలీ తరువాత అంతటి విజయవంతమైన కెప్టెన్ గా చరిత్ర సృష్టించిన ధోనీ తీసుకున్న ఈ అకస్మాత్ నిర్ణయం వెనుక కారణాలేంటి? రిటైర్ మెంట్ నిర్ణయం ప్రకటించే ముందు ధోనీ ఏం చేశాడో తెలుసా?... ఇప్పుడీ విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.

నిన్న రంజీ ట్రోఫీలో భాగంగా గుజరాత్ - జార్ఖండ్ జట్ల మధ్య సెమీ ఫైనల్ మ్యాచ్ జరుగగా, మెంటార్ కెప్టెన్ గా ధోనీ మ్యాచ్ ని ఆసాంతం తిలకించాడు. అక్కడే తన రిటైర్ మెంట్ నిర్ణయాన్ని ప్రకటించాడు. అంతకన్నా ముందు జార్ఖండ్ జట్టు రంజీ ఆటగాళ్లతో దాదాపు అరగంట పాటు సమావేశమై, తన క్రికెట్ ప్రస్థానాన్ని, తాను ఎదుర్కొన్న వివిధ అంశాలను గురించి చెప్పాడని తెలుస్తోంది. తన అనుభవాలను జూనియర్లకు వివరించిన ఆయన, కాసేపు ప్రాక్టీస్ చేస్తూ, జార్ఖండ్ వికెట్ కీపర్ ఇషాన్ కిషాన్ కు కొన్ని మెళుకువలను కూడా నేర్పాడు. తన ట్రేడ్ మార్క్ షాట్ అయిన 'హెలికాప్టర్ షాట్'ను ఎలా ఆడాలో నేర్పించాడు. ఆపై తాను బసచేసిన హోటల్ లోని సిబ్బందికి ఆటోగ్రాఫ్స్ ఇచ్చి వారితో ఫోటోలు దిగాడు. అనంతరం తన క్రికెట్ రిటైర్ మెంట్ నిర్ణయాన్ని ప్రకటించాడు.

More Telugu News