: ప్రపంచంలోనే పెద్దదైన 'రాకాసి తిమింగలం' చనిపోయిందా?... కలవరపడుతున్న శాస్త్రవేత్తలు!

యావత్ ప్రపంచంలోనే అత్యధిక వయసు గల కిల్లర్ వేల్ (రాకాసి తిమింగలం) కనిపించక పోవడం ఆందోళన కలిగిస్తోంది. అది చనిపోయిందా? లేక అదృశ్యమయిందా? అనే సందేహం శాస్త్రవేత్తలు, పర్యావరణవేత్తలను కలవరపరుస్తోంది. ఈ వేల్ కు దాదాపు 105 సంవత్సరాల వయసు ఉంటుంది. దీనికి ముద్దుగా 'గ్రాన్నీ' అనే పేరు పెట్టారు. ఇది ఆడ తిమింగలం.

కిల్లర్ వేల్స్ ఇతర ఆడ, పిల్ల తిమింగలాలకు రక్షణ కల్పిస్తుంటాయి. మరో విషయం ఏమిటంటే, తోటి మగ తిమింగలాలకు కూడా ఇవి ఆహారాన్ని అందిస్తుంటాయి. ఈ తిమింగలాల ఫ్యామిలీలో గ్రాన్నీతో పాటు మరికొన్ని తిమింగలాలు మాత్రమే కీలక పాత్ర పోషిస్తున్నాయి. గ్రాన్నీ ఎన్నో ఏళ్లుగా తన వర్గానికి చెందిన తిమింగలాలకు రక్షణ కల్పించింది. అంతేకాదు, ఆహారాన్ని ఎలా సంపాదించుకోవాలి? ఆహారం ఎక్కడ దొరుకుతుంది? అనే విషయాల్లో కూడా తన ఫ్యామిలీకి సూచనలు ఇచ్చేది.

1972లో తొలిసారిగా కెన్ బాల్ కోంబ్ అనే రీసెర్చర్ దీని ఫొటో తీశాడు. సెంటర్ ఫర్ వేల్ రీసెర్చ్ వారు దీనికి 'జే2' అనే పేరు పెట్టారు. దాదాపు 4 దశాబ్దాల పాటు గ్రాన్నీపై రీసెర్చ్ జరిగింది. గత ఏడాది అక్టోబర్ 12న ఇది చివరిసారిగా కనిపించింది. ఆ తర్వాత కనిపించలేదు. చాలామంది గ్రాన్నీ చనిపోయి ఉండవచ్చని భావిస్తున్నారు.

More Telugu News