: స‌రికొత్త రికార్డు కోసం చైనా పాకులాట‌.. ఈ ఏడాదిలో 30 అంత‌రిక్ష ప‌రీక్ష‌ల కోసం త‌హ‌త‌హ‌!

అంత‌రిక్ష పరిశోధ‌న‌ల్లో రికార్డుల కోసం చైనా త‌హ‌త‌హ‌లాడుతోంది. ఈ రంగంలో ప‌రిశోధ‌న‌ల‌ను మ‌రింత విస్తృతం చేసేందుకు ఈ ఏడాదిలో ఏకంగా 30 స్పేస్ మిష‌న్స్‌ను ప్రారంభించ‌బోతోంది. ఒక్క ఏడాదిలో ఇన్ని మిష‌న్స్‌ను ప్రారంభించ‌డం రికార్డేన‌ని చైనా ఏరోస్పేస్ సైన్స్ అండ్ టెక్నాల‌జీ కార్పొరేష‌న్ తెలిపింది. డ్రాగ‌న్ కంట్రీ అతిపెద్ద క్యారియ‌ర్ అయిన‌ లాంగ్‌మార్చ్‌-5, లాంగ్ మార్చ్‌-7 రాకెట్ల ద్వారా ఈ ప్ర‌యోగాలు నిర్వహించ‌నున్న‌ట్టు పేర్కొంది.

2018 నాటికి లూనార్ ప్రోబ్ మిషన్‌ను ప్రారంభిస్తామ‌ని ఇటీవ‌ల ప్ర‌క‌టించిన చైనా ఈ ఏడాది లాంగ్‌మార్చ్‌-5 రాకెట్ ద్వారా అంగార‌కుడిపైకి ఓ ప్రోబ్‌ను పంపించ‌నుంది. అలాగే ఇదే ఏడాదిలో లాంగ్‌మార్చ్‌-7 రాకెట్ ద్వారా తొలిసారిగా కార్గో అంత‌రిక్ష నౌక 'టియాన్‌జియో-1'ను అంత‌రిక్షంలోకి పంప‌నున్న‌ట్టు మానిడ్ స్పేస్ ఇంజినీరింగ్ కార్యాల‌య సంచాల‌కుడు వాంగ్ ఝూయో తెలిపారు. కాగా 2015లో 19 స్పేస్ మిష‌న్లు ప్రారంభించిన చైనా గ‌తేడాది 22 ప్రారంభించింది. ఈ ఏడాది వాటి సంఖ్య‌ను ఏకంగా 30కి పెంచింది.

More Telugu News