: ఫిన్ లాండ్ లో నిరుద్యోగులకు ప్రతి నెలా 590 డాలర్ల భృతి!

ఫిన్ లాండ్ లో నిరుద్యోగుల కోసం అక్కడి ప్రభుత్వం ఒక కొత్త పథకాన్ని తీసుకువచ్చింది. 2019 వరకు ప్రయోగాత్మకంగా అమలు చేయనున్న ఈ పథకం ప్రకారం... అక్కడి నిరుద్యోగులకు ప్రతి నెలా 590 డాలర్లను యూరో కరెన్సీలో ఉచితంగా ఇస్తుంది. ఇంత మొత్తం సొమ్మును వారికి ప్రతినెలా ఇస్తేనే ఆ దేశంలో కనీస సౌకర్యాలు లభిస్తాయి. అయితే, ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్న నిరుద్యోగులకు ఎక్కడైనా ఉద్యోగం లభిస్తే కనుక, ఈ ప్రయోజనాన్ని వదలుకోవాల్సిన అవసరం లేదు.

కానీ, స్వచ్ఛందంగా వద్దని అనుకుంటే మాత్రం ఆ ప్రయోజనాన్ని వదులుకోవచ్చు. ఇదిలా ఉండగా, ఈ పథకంపై కొందరు పెదవి విరుస్తున్నారు. దీనివల్ల నిరుద్యోగులు సోమరిపోతులవుతారని విమర్శిస్తున్నారు. ప్రభుత్వ అధికారులు మాత్రం ఈ పథకంతో నిరుద్యోగులు మరిన్ని ఉద్యోగ ప్రయత్నాలు చేస్తారని ఆశిస్తున్నారు. ఈ పథకాన్ని తొలి దశలో రెండు వేల మంది నిరుద్యోగులకు మాత్రమే పరిమితం చేయనున్నామన్నారు.  

More Telugu News