social media: యజమాని నుంచి ఐస్‌క్రీం లాక్కొని తిన్న పిల్లి.. సోషల్ మీడియాలో వీడియో వైరల్!

ఓ పిల్లి ఎంతో ఇష్టంతో ఐస్‌క్రీం తింటుండ‌గా దాని య‌జ‌మాని తీసిన ఓ వీడియో ఇప్పుడు సోష‌ల్‌ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతూ అంద‌ర్నీ అల‌రిస్తోంది. రష్యాకు చెందిన ఓ కుటుంబం పెంచుకునే ఓ పిల్లికి కిట్టీ అనే పేరుపెట్టుకున్నారు. ఆ పిల్లి కుటుంబ స‌భ్యుల‌తో చ‌క్క‌గా క‌లిసిపోయింది. త‌మ‌ కుటుంబ స‌భ్యుల్లో ఒకరిలా ఈ పిల్లిని చూస్తుంటారు. దానికి ఐస్‌క్రీం తినే అలవాటును చేశారు.

ఈ నేప‌థ్యంలోనే ఒక రోజు కిట్టీ యజమాని త‌మ ఇంటికి ఐస్‌క్రీం తింటూ వచ్చాడు. ఆయ‌న‌ను గమనించిన స‌ద‌రు పిల్లి వెంట‌నే అతని నుంచి ఐస్‌క్రీం లాక్కొని, మంచం మీదకు వెళ్లి తినడం మొదలుపెట్టింది. ఆశ్చ‌ర్య‌పోయిన స‌ద‌రు య‌జ‌మాని ఆ పిల్లి ఐస్‌క్రీం తింటుండ‌గా వీడియో తీసి సామాజిక మాధ్య‌మాల్లో పెట్టాడు. ఐస్ క్రీం అంతా పూర్తయ్యేంత వరకు దృష్టి మ‌ళ్లించ‌కుండా చివ‌రి క్ష‌ణం వ‌ర‌కు అది తిన్న విధానాన్ని నెటిజ‌న్లు విప‌రీతంగా చూస్తున్నారు.

More Telugu News