: తమిళనాడులో ఉచిత ధోతీ, శారీ పథకం ప్రారంభం!

తమిళనాడులో ఉచిత ధోతి,  శారీ పథకం అందుబాటులోకి వచ్చింది. ఈ పథకాన్ని సీఎం పన్నీర్ సెల్వం సచివాలయంలో ఈరోజు ప్రారంభించారు. ఏడు కుటుంబాలకు ఉచిత ధోతి, శారీలను అందజేశారు. ఈ పథకం ద్వారా పేదవారికి లబ్ధి చేకూరడంతో పాటు వస్త్ర, చేనేత పరిశ్రమల్లో పని చేసే వారికి చేయూత నిచ్చినట్లు అవుతుందని ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు అన్నారు. ఈ పథకం వల్ల రూ.486.36 కోట్ల అదనపు భారం ఖజానాపై పడనుందని అన్నారు. కాగా, ఏఐఏడీఎంకే వ్యవస్థాపకుడు ఎంజీ రామచంద్రన్ ఈ పథకాన్ని 1983లో మొట్టమొదట ప్రవేశపెట్టారు. 

More Telugu News