: దివ్యాంగుల కోసం మూడు వేల ప్రత్యేక బోగీలను తయారు చేయనున్న రైల్వేశాఖ

దివ్యాంగుల ప్రయాణ సౌకర్యార్థం మూడు వేల ప్రత్యేక బోగీలను రైల్వే శాఖ తయారు చేయనుంది. ఈ బోగీలలో దివ్యాంగులకు పలు వసతులు కల్పించనున్నట్లు దివ్యాంగుల విభాగం ముఖ్య కమిషనర్ కమలేశ్ పాండే చెప్పారు. 2018 నాటికి ఈ ప్రత్యేక బోగీలను రైల్వేశాఖ తయారు చేయనుందని, ఈ బోగీలను ఒకదానితో ఒకటి అనుసంధానిస్తారని తెలిపారు. కాగా, ముంబై, నాసిక్, నాగ్ పూర్ లోని సుమారు 180 ప్రభుత్వ భవనాలను దివ్యాంగులకు అనుకూలంగా మార్చేందుకు ఆయా భవనాల్లో ర్యాంపులు, లిఫ్టుల వంటి సౌకర్యాలు కల్పించనున్నట్లు కమలేశ్ పాండే చెప్పారు.

More Telugu News