: ఎన్నికల కోసం రెండు మూడు లక్షలు తీసుకుంటే తప్పేమీ కాదు: మమతా బెనర్జీ

"నాకు తెలిసినంత వరకూ ఎన్నికల్లో వివిధ రకాల ప్రచార ఖర్చుల నిమిత్తం 2 నుంచి 3 లక్షల రూపాయలు తీసుకుంటే పెద్ద తప్పేమీ కాదు. ఈ విషయం గురించి నాకేమీ తెలియదు గానీ, ఇదే ఆయన తప్పయితే, ప్రధాని మోదీని కూడా అరెస్ట్ చేయాల్సిందే. కోట్ల రూపాయలు పెట్టి సూట్ కుట్టించుకోవడానికి ఆయనకు అంత డబ్బెలా వచ్చింది? బీజేపీ నేతలు విరాళాల కోసం అదానీ గ్రూప్ సహాయాన్ని తీసుకోలేదా? దొంగలందరికీ పెద్దలు వారే" అని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు.

ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్న చిట్ ఫండ్ కంపెనీలన్నీ 1980వ దశకంలో వామపక్ష ప్రభుత్వాలు ఉన్న వేళ ఏర్పాటైనవేనని గుర్తు చేశారు. తమ వారిని అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నారని, నోట్ల రద్దు విషయంలో తనను సైలెంట్ గా ఉంచాలన్నదే వారి లక్ష్యమని ఆరోపించారు.

More Telugu News