: దావూద్ ఇబ్రహీంకు చెందిన 15,000 కోట్ల ఆస్తులను స్వాధీనం చేసుకున్న దుబాయ్!

1993 ముంబయి వరుస బాంబు పేలుళ్ల ప్రధాన సూత్రధారి దావూద్‌ ఇబ్రహీం ఆస్తులను దుబాయ్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అతనికి చెందిన సుమారు 15,000 కోట్ల రూపాయల ఆస్తులను స్వాధీనం చేసుకున్నట్లు యూఏఈ ప్రభుత్వం నిర్ధారించింది. ఇందులో దావూద్ కు సంబంధించిన స్థిర చరాస్తులు ఉన్నట్టు తెలుస్తోంది. దావూద్ కి సంబంధించిన ఆస్తుల సమాచారాన్ని దుబాయ్ ప్రభుత్వానికి భారత్ పంపించడంతో విచారణ చేపట్టిన యూఏఈ ప్రభుత్వం అతని ఆస్తులను సీజ్ చేసింది.

కాగా, గతేడాది ప్రధాని మోదీ, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌ యూఏఈ పర్యటనకు వెళ్లిన సందర్భంగా రెండు దేశాల మధ్య నేరస్థుల విషయంలో సహాయసహకారాలు అందించుకోవాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. దుబాయ్‌ లో దావూద్‌ ఇబ్రహీం సోదరుడు గోల్డెన్‌ బాక్స్‌ పేరుతో ఓ కంపెనీని నడుపుతున్నట్టు అధికారులు గుర్తించారు. మొరాకో, స్పెయిన్‌, యూఏఈ, సింగపూర్‌, థాయ్ లాండ్‌, సైప్రస్‌, టర్కీ, భారత్‌, పాకిస్థాన్‌, యూకెల్లో దావూద్‌ ఆస్తులు ఉన్నాయని భారత్ చెబుతున్న సంగతి తెలిసిందే. 

More Telugu News