: అవసరమైతే మరిన్ని సర్జికల్ స్ట్రయిక్స్ చేస్తాం: ఆర్మీ చీఫ్ రావత్

నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) వెంబడి ఉగ్రశిబిరాలపై దాడులు చేసే హక్కు భారత్‌ కు ఉందని కొత్త ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ తెలిపారు. సైన్యాధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం జాతీయ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ, అవసరమైతే సరిహద్దుల వెంబడి మరిన్ని సర్జికల్ స్ట్రయిక్స్ కు వెనుకాడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. గత ఏడాది పాక్ ఉగ్రశిబిరాలపై భారత సైన్యం ఎంతో పకడ్బందీగా దాడులు చేసిందని ఆయన చెప్పారు. ఈ ఆపరేషన్‌ ను ఆర్మీ స్టాఫ్ వైస్‌ చీఫ్‌ గా రావత్ స్వయంగా పర్యవేక్షించారు.

దానిపై ఆయన స్పందిస్తూ, పాక్ ఉగ్రశిబిరాలపై లక్షిత దాడులు చాలా పక్కాగా, మెరుపువేగంతో నిర్వహించామని అన్నారు. ఒకవైపు దాడులు, మరోవైపు దళాల భద్రత రెండూ ఏకకాలంలో మానిటర్ చేసుకుంటూ దాడులు నిర్వహించామని, అయితే సర్జికల్ స్ట్రయిక్స్ క్రెడిట్ ఇంతకు ముందు సైన్యాధ్యక్షుడుగా పని చేసిన దల్బీర్ సింగ్‌ సుహాగ్‌ కే దక్కుతుందని తెలిపారు. కాగా, నియంత్రణ రేఖ వెంబడి పాక్ ప్రేరేపిత ఉగ్రవాద శిబిరాలపై గత ఏడాది నవంబర్ 29న భారత సైన్యం సర్జికల్ దాడులతో విరుచుకుపడి 30 మందికి పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టిన సంగతి తెలిసిందే. 

More Telugu News