: రిపోర్టుతో మీ దగ్గరకు వస్తున్నా... 15 రోజుల్లో స్పందించాలి.. ఆపై మీ ఇష్టం!: చంద్రబాబు సర్కారుకు పవన్ హెచ్చరిక

ఉద్దానం, ఇచ్చాపురం, కవిటి, టెక్కలి, వజ్రపుకొత్తూరు సహా ఇతర మండలాల్లో కిడ్నీ వ్యాధుల బారిన పడ్డవారిని ఆదుకునేందుకు చంద్రబాబు ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. ప్రజలకు లబ్ది కలిగేలా ఓ ఆర్థిక, ఆరోగ్య ప్యాకేజీని ప్రకటించాలని కోరారు. కిడ్నీ వ్యాధులపై తాను ఐదుగురు డాక్టర్లు, జనసేన కార్యకర్తలతో కూడిన కమిటీని వేస్తున్నట్టు ప్రకటించారు. ఈ కమిటీ రెండు వారాల్లో తన నివేదికను ఇస్తుందని చెప్పారు.

"ఈ రిపోర్టును ఇచ్చేందుకు నేను స్వయంగా చంద్రబాబు దగ్గరకు వెళ్తాను. రిపోర్టు ఇచ్చిన 15 రోజుల్లోగా ప్రభుత్వం స్పందించాలి. లేకుంటే ప్రజా ఉద్యమం చేపడతాం. ఆపై మీ ఇష్టం’అని హెచ్చరించారు. కిడ్నీ బాధిత కుటుంబాల్లో అనాథలైన చిన్నారుల సంరక్షణ బాధ్యతలను తక్షణం చంద్రబాబు ప్రభుత్వం స్వీకరించాలని, వారి బాగోగులను చూసి, వారి భవిష్యత్తు బాగుండేలా చేయాలని డిమాండ్ చేశారు. వారికి ఆర్థికంగా సాయం చేయాలని లేదా దత్తత తీసుకుని పెంచాలని, ప్రభుత్వం తరఫున కూడా ఓ కమిటీ వేయాలని చెప్పారు.

More Telugu News