: ముందు మీరు మాట్లాడండి... తరువాత నేనేం చేస్తానో చెబుతా!: కిడ్నీ బాధితులతో పవన్

ఉద్దానం బాధితులను పరామర్శించేందుకు శ్రీకాకుళం వచ్చిన జనసేన అధినేత పవన్ కల్యాణ్, బాధితుల సమస్యలు ప్రపంచం దృష్టికి తీసుకు వెళ్లాల్సి వుందని వ్యాఖ్యానించారు. సమస్య తీవ్రతను దేశ ప్రజలకు తెలిపేలా కనీసం ఐదుగురు వేదికపైకి వచ్చి తమ దీనావస్థ గురించి మాట్లాడాలని కోరారు. బాధితుల ఇబ్బందుల గురించి తెలుసుకున్న తరువాత, కిడ్నీ సమస్యలపై జనసేన ఎటువంటి అడుగులు వేస్తుందన్న విషయాన్ని తాను ప్రకటిస్తానని చెప్పారు. ఈ సమస్య ఇక్కడితో వదిలి పోవాలన్నదే తన లక్ష్యమని, సాధ్యమైనంత త్వరగా పరిష్కారం లభిస్తుందన్న ఆశ తనకుందని ఈ సందర్భంగా పవన్ చెప్పారు.

ప్రస్తుతం కిడ్నీ బాధితులు పవన్ ముందు తమ గోడును వెళ్లబోసుకుంటున్నారు. నెలకు తొమ్మిది నుంచి పదివేల రూపాయలు ఖర్చు పెడితేనే తాను లేచి తిరగ్గలుగుతానని, లేకుంటే మంచం మీద పడుండాల్సిందేనని ఓ వ్యక్తి చెప్పగా, తన తల్లి కిడ్నీ వ్యాధితో చనిపోగా, అనాధలుగా మిగిలామని ఓ చిన్నారి తన బాధను పవన్ కు చెప్పాడు. తమ గ్రామంలో 200 మందికి కిడ్నీ వ్యాధులు సోకాయని, వైద్యానికి ఇచ్చాపురం, సోంపేటలకు వెళ్లినా తగ్గలేదని, ఇప్పటికే 100 మందికి పైగా చనిపోయారని ఓ మత్స్యకార మహిళ వాపోయింది.

More Telugu News