: పెద్ద నోట్ల రద్దు తర్వాత ఐటీ అధికారులు ఎన్ని కోట్లు పట్టుకున్నారో తెలుసా?

నవంబర్ 8వ తేదీన పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రధాని మోదీ ప్రకటించిన అనంతరం... లెక్కల్లో చూపని ఆదాయాన్ని ఐటీ అధికారులు భారీ ఎత్తున గుర్తించారు. దేశ వ్యాప్తంగా జరిపిన దాడుల్లో ఇప్పటి వరకు రూ. 4,663 కోట్లు పట్టుబడ్డాయి. దేశం మొత్తం మీద ఇప్పటి వరకు 253 చోట్ల తనిఖీలు చేశారు. పన్నులకు సంబంధించి 5,062 మందికి నోటీసులు పంపారు. పలు బ్యాంకులపై దాడులు చేసి, అవకతవకలు జరిగినట్టు గుర్తించారు.

More Telugu News