: కనీస వీడ్కోలు కూడా ఇవ్వలేదు... పదవీ విరమణ చేసి నేరుగా ఇంటికి వెళ్లిపోయిన తెలంగాణ మాజీ సీఎస్ ప్రదీప్ చంద్ర!

తెలంగాణ చీఫ్ సెక్రటరీగా నెల రోజుల పాటు పనిచేసిన ఐఏఎస్ అధికారి ప్రదీప్ చంద్రకు కనీస వీడ్కోలు గౌరవం కూడా దక్కలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నవంబరు నెలాఖరులో రాజీవ్ శర్మ పదవీ విరమణ చేయగా, ఆయన స్థానంలో ప్రదీప్ చంద్రను నియమించిన సంగతి తెలిసిందే. ప్రదీప్ చంద్ర పదవీ కాలం డిసెంబరుతో ముగియగా, ఆయన పదవీ కాలాన్ని పొడిగించేందుకు కేంద్రం అనుమతించని నేపథ్యంలో పదవీ విరమణ అనివార్యమైంది.

సాధారణంగా సీఎస్ పదవీ విరమణ చేస్తే, సచివాలయంలో సభ నిర్వహించి వీడ్కోలు పలకడం ఆనవాయితీ. రాజీవ్ శర్మ రిటైర్ మెంట్ సమయంలో ఆయన పనితీరును కేసీఆర్ స్వయంగా పొగిడారు కూడా. ఆపై ప్రభుత్వ సలహాదారు పదవిని కూడా అప్పగించారు. ప్రదీప్ చంద్ర కోసం ఎలాంటి సభనూ పెట్టలేదు. ఆయన పదవీ విరమణ పత్రాలపై సంతకం చేసి నేరుగా ఇంటికి వెళ్లిపోయారు. ఆపై కొత్తగా నియమించబడ్డ ఎస్పీ సింగ్ కు బాధ్యతలు అప్పగించేందుకు కూడా రాలేదు. ఈ వ్యవహారం ఇప్పుడు రాజకీయ, అధికార వర్గాల్లో కొత్త చర్చకు తెరలేపింది.

More Telugu News