: సైన్స్ కాంగ్రెస్ కు వేళాయె... అతిథుల రాకతో తిరుపతికి కొత్త కళ!

నిత్యమూ శ్రీవేంకటేశ్వరుని భక్తులతో కిటకిటలాడుతుండే తిరుపతి నగరం కొత్త కళను సంతరించుకుంది. నేటి నుంచి 104వ సైన్స్ కాంగ్రెస్ సదస్సు జరుగనుండగా, ఎంతో మంది నోబెల్ పురస్కార గ్రహీతలు, శాస్త్రవేత్తలు, వివిధ దేశాల ప్రతినిధులు, వీఐపీలు ఇప్పటికే తిరుపతి చేరుకున్నారు. అతిథుల రాక సందర్భంగా శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం సహా, తిరుపతి పట్టణ వీధులను విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. ఈ ఉదయం సదస్సును ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ రానున్నారు. ఉదయం 10:25కు ప్రత్యేక విమానంలో రేణిగుంట చేరుకునే ఆయన, సదస్సును ప్రారంభించిన అనంతరం మధ్యాహ్నం 1:30 గంటల తరువాత తిరుమలకు వెళ్లి శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఆపై మధ్యాహ్నం 3:45 గంటలకు మోదీ ఢిల్లీ బయలుదేరి వెళతారు. ప్రధాని రాక సందర్భంగా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.

More Telugu News