: జపనీయులు నిద్రకు ఇచ్చే ప్రాధాన్యత ఇదీ!

జపనీయులను పనిరాక్షసులని పేర్కొంటారన్న సంగతి చాలామందికి తెలుసు. రెండో ప్రపంచ యుద్ధం తరువాత ఎంత పని చేస్తే అంతగొప్పవారన్న భావన నుంచి వారు పనిరాక్షసులుగా రూపొందారు. అలాంటి జపనీయులు నిద్రకు అందరూ కోరుకునే సౌకర్యాలు కోరుకోరని తాజా పరిశోధన చెబుతోంది. నిద్రంటే నాలుగు గోడల మధ్య, బెడ్ పై కాళ్లు చాపుకుని, లైట్లాపేసి నిద్రపోవడం కాదని.. రోడ్డుపైనో లేక కంపెనీలోనో, నడుస్తూనో, మాట్లాడుతూనో పోయే నిద్ర కూడా నిద్రేనని జపనీయుల నిద్రపై పరిశోధనలు చేసిన డాక్టర్ బ్రిగిట్ స్టెగార్ అంటున్నారు.  షాపింగ్ చేస్తూ, నడుస్తూ, మెట్లెక్కుతూ, గోడకు చేరగిలపడి, కుర్చీలో కూర్చుని.. ఇలా తీసే కునుకు వారికి సరిపోతుందని ఆయన చెబుతున్నారు. దీనిని వారు 'ఇనెమురి' అంటారని ఆయన చెబుతున్నారు.

ప్రయాణంలో, క్లాసులో పాఠం వింటూ, మీటింగ్ లో భాగస్వామ్యమవుతూ జపనీయులు నిద్ర పోతుంటారని ఆయన తెలిపారు. మనదేశంలో ఇలా ఎవరైనా పని చేస్తూనో, తరగతి గడిలోనో, మీటింగ్ మధ్యలోనో నిద్రపోతే చిన్న చూపుచూస్తాం. కానీ జపాన్ లో మాత్రం 'రాత్రంతా నిద్రలేకుండా పని చేసి అలసిపోయాడు. 'ఇనెమురి'లో ఉన్నాడు' అనుకుంటారని ఆయన తెలిపారు. దీనిని విశ్రాంతి తీసుకుంటూనే పనిలో పాల్గొనడం అంటారు. కాసేపు విశ్రాంతి తీసుకుని, తన వంతు రాగానే క్రమశిక్షణతో పనిచేయడమని వారు చెబుతున్నారు. 

More Telugu News