: నాలుగు నిమిషాల తేడాతో కవలల డేట్ ఆఫ్ బర్త్ మారిపోయింది!

కవల పిల్లలే కానీ, వారు జన్మించిన సంవత్సరాలు మాత్రం మారాయి. కేవలం నాలుగు నిమిషాల తేడాతో పాత, కొత్త  సంవత్సరాల్లో ఆ కవలలు జన్మించారు. అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రానికి చెందిన మహిళ బ్రిట్నీ డిసెంబరు 31వ తేదీ రాత్రి కవలలకు (ఇద్దరూ ఆడపిల్లలు) జన్మనిచ్చింది. అయితే, ఆ చిన్నారులు పుట్టిన తేదీల విషయం చాలా ఆసక్తికరం. శాండియగోలోని షార్ప్ మేరీ బిర్చ్ హాస్పిట్ లోమొదటి బిడ్డ డిసెంబరు 31వ తేదీ రాత్రి 11.56 గంటలకు పుట్టగా, మరో బిడ్డ రాత్రి 12 గంటలకు.. అంటే, 2017వ సంత్సరంలో పుట్టిందని, కవలల తల్లిదండ్రులు బ్రిట్నీ, బ్రెట్ అని ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి. కాగా, ఇదే తరహా సంఘటన మరోటి జరిగింది. మారిడెల్ వాలెన్సియా అనే ఇరవై రెండు సంవత్సరాల మహిళ కవలలకు జన్మనిచ్చింది. ఈ కవలలలో ఒకరు మగ, ఆడ శిశువులు. మరో నిమిషం గడిస్తే కొత్త సంవత్సరం వస్తుందనగా.. అంటే డిసెంబరు 31వ తేదీ రాత్రి 11.59 గంటలకు ఒకరు, 12.02 గంటలకు మరొకరు జన్మించడం విశేషం.  

More Telugu News