banks: ఎక్కువగా పనిచేశాం.. ఆ సమయాన్ని ఓవర్‌టైమ్‌గా గుర్తించండి!: మోదీకి బ్యాంకు ఉద్యోగుల వినతి

పెద్దనోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తరువాత దేశంలోని బ్యాంకుల సిబ్బంది అధికసమయం పనిచేసిన సంగతి తెలిసిందే. అయితే, ఆ ప‌ని గంట‌ల‌ను అదనపు సమయంగా పరిగణించాలని భారతీయ మజ్దూర్‌ సంఘ్‌ గుర్తింపు పొందిన నేషనల్‌ ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ బ్యాంకు వర్కర్స్‌ (ఎన్‌వోబీడబ్ల్యూ) కేంద్ర ప్ర‌భుత్వానికి ఓ లేఖ రాసింది. పెద్ద‌నోట్లను ర‌ద్దు చేసిన రోజు నుంచి 50 రోజుల పాటు బ్యాంకులు ఎంతో క‌ష్ట‌ప‌డి ప‌ని చేశాయ‌ని పేర్కొంది. బ్యాంకు సిబ్బంది ప్ర‌తిరోజూ 12 నుంచి 18గంటల పాటు ప‌నిచేశార‌ని చెప్పింది. వారు ప‌నిచేసిన మిగ‌తా స‌మ‌యాన్ని ఓవర్‌టైమ్‌గా గుర్తించాలని కోరుతున్న‌ట్లు లేఖ ద్వారా కోరింది.

కాగా, బ్యాంకు ఉద్యోగులకు వేతన సవరణను నవంబర్‌ 2017లోపు చేయాల‌ని ఎన్‌వోబీడబ్ల్యూ అధ్యక్షుడు అశ్విన్‌ రానా అన్నారు. ఆ అంశంలో స‌ర్కారు ఐబీఏకు ఇప్పటికే సూచన‌లు చేసింద‌ని చెప్పారు. అయితే, తాము ప్ర‌స్తుతం మ‌రో అంశాన్ని ప్ర‌భుత్వ‌ దృష్టికి తీసుకొస్తున్నామ‌ని,  ప్రభుత్వ ఉద్యోగుల వేతన వ్యవస్థతో పోలిస్తే బ్యాంకు ఉద్యోగుల వేత‌నాలు త‌క్కువ‌గా ఉన్నాయ‌ని, వేత‌న స‌వ‌ర‌ణ‌ల‌పై దృష్టిపెట్టాల‌ని ఆయ‌న కోరారు.

More Telugu News