: సీమలో తుపాకుల ఆట పోవాలి.. జలక్రీడలు రావాలి!: చంద్రబాబు

రాయలసీమలో తుపాకుల ఆట పోవాలని, జలక్రీడలు రావాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. కర్నూలు జిల్లా తడకనపల్లిలో నిర్వహించిన జన్మభూమి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీలోనే తొలిసారిగా పశువుల హాస్టల్ (క్షీరసాగర సదనం) ను ప్రారంభించారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ, ఈసారి జన్మభూమి కార్యక్రమంలో కుటుంబ వికాసం, సమాజ వికాసమే ప్రధానాంశాలుగా ఉన్నాయని, ఇందులో భాగంగానే తడకనపల్లెలో రూ.2 కోట్లతో పశువుల హాస్టల్ ను ప్రారంభించామని, ఈ తరహా హాస్టల్ ఏర్పాటు చేయడం ఇదే ప్రథమం అని అన్నారు.

నగదు రహిత లావాదేవీలపై ప్రజలు దృష్టి సారించాలని, తడకనపల్లి వాసులంతా మొబైల్స్ కొనుగోలు చేయాలని.. రూ. వెయ్యి చొప్పున రాయితీ ఇస్తామని అన్నారు. తడకనపల్లిలో నెలరోజుల్లో ఫైబర్ గ్రిడ్ సేవలు లభిస్తాయని, ఈ గ్రామం త్వరలో డిజిటలైజ్ కానుందని,  డిజిటల్ లావాదేవీలు నిర్వహించేందుకు ప్రజలు సిద్ధంగా ఉండాలని చంద్రబాబు అన్నారు.

More Telugu News