pawan kalyan: కిడ్నీ వ్యాధి బాధితుల బాధలు మీరే చూడండి: ట్విట్టర్ లో వీడియో పోస్ట్ చేసిన పవన్‌ కల్యాణ్

జనసేనాని, సినీన‌టుడు పవన్‌కల్యాణ్ రేపు శ్రీకాకుళం జిల్లాలోని ఉద్ధానం గ్రామంలో ప‌ర్య‌టించ‌నున్న విష‌యం తెలిసిందే. ఇందు కోసం జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు, ఆయ‌న అభిమానులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ క్రమంలో ఈ రోజు ప‌వ‌న్ క‌ల్యాణ్ ఈ విషయాన్ని తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా తెలుపుతూ.. ఆ ప్రాంతంలో కిడ్నీ సంబంధ వ్యాధులతో గత ఇరవై ఏళ్లలో 20వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయార‌ని చెప్పారు. ప్రస్తుతం బాధితుల సంఖ్య‌ లక్షల మందికి చేరింద‌ని అన్నారు.

వారు ఇన్ని బాధ‌లు ప‌డుతోంటే స‌ర్కారు మాత్రం వారి గురించి పట్టించుకోవ‌డం లేద‌ని అన్నారు. త‌మ పార్టీ విలేకరుల టీమ్‌ అక్కడికి వెళ్లి వారి సమస్యలపై డాక్యుమెంటరీ తయారు చేసిందని ఈ వీడియోనే పోస్ట్ చేస్తున్నాన‌ని చెప్పారు. ఈ రోజు సాయంత్రం ఆ ప్రాంతానికి చేరుకుంటాన‌ని, రేపు బాధితులతో మాట్లాడతాన‌ని అన్నారు. ఈ వీడియోను చూసి బాధితుల సమస్య ఎంత‌ తీవ్రత‌తో ఉందో తెలుసుకోవాలని ఆయ‌న పేర్కొన్నారు.


More Telugu News