Dangal film: భారీ కలెక్షన్లు రాబడుతూ దూసుకుపోతున్న ఆమిర్ ఖాన్ ‘దంగల్’!

బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్‌ నటించిన ‘దంగ‌ల్’ చిత్రం కాసుల వ‌ర్షం కురిపిస్తూ దూసుకుపోతోంది. డిసెంబర్‌ 23న విడుదలైన ఈ సినిమా ఇప్పటి వరకూ ప్రపంచ వ్యాప్తంగా 411 కోట్ల రూపాయల‌ వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. వాటిలో దేశ వ్యాప్తంగా వ‌చ్చిన క‌లెక్ష‌న్లు 270 కోట్ల రూపాయలు కాగా, ఓవర్సీస్‌లో వ‌చ్చిన వ‌సూళ్లు 141 కోట్ల రూపాయలు. ఈ సినిమా తొలివారం దేశీయ మార్కెట్లో 197.53 కోట్లు రాబ‌ట్టి, గ‌త ఏడాది తొలివారంలో అత్య‌ధిక వసూళ్లు రాబ‌ట్టిన చిత్రంగా నిలిచింది. అంత‌కు ముందు గతేడాది ఈ రికార్డు సల్మాన్‌ ఖాన్‌ ‘సుల్తాన్’ సినిమా పేరిట ఉండేది. తొలివారంలో సుల్తాన్ చిత్రం 180.36 కోట్ల రూపాయలను రాబ‌ట్టిన విష‌యం తెలిసిందే.

More Telugu News