v5 plus: ‘వీ5 ప్లస్‌’... ఈ స్మార్ట్‌ఫోన్‌లో రెండు సెల్ఫీ కెమెరాలు.. పర్ఫెక్ట్ సెల్ఫీ తీసుకోవచ్చు!

ఎప్ప‌టిక‌ప్పుడు సెల్ఫీ స్మార్ట్ ఫోన్‌ల‌ను తీసుకొస్తూ సెల్ఫీ ప్రియుల‌ను ఆక‌ర్షిస్తోన్న వివో సంస్థ ఈ సారి మ‌రో స‌రికొత్త ప్ర‌యోగం చేసింది. డ్యుయల్‌ ఫ్రంట్‌ కెమెరా కలిగిన ‘వీ5 ప్లస్‌’ మోడల్‌ను రూపొందించింది. ఈ నెల 23న ఈ మోడ‌ల్‌ను భార‌త మార్కెట్‌లోకి విడుదల చేయనున్న‌ట్లు తెలిపింది. వివో ఫోన్‌లు ఇప్పటివరకు వెనకవైపున‌ రెండు కెమెరాలు క‌లిగి ఉండేవి. ఈ స‌దుపాయంతో ఆక‌ట్టుకున్న వివో ఇప్పుడు ముందు వైపు రెండు సెల్ఫీ కెమెరాలతో ఈ మోడ‌ల్‌ను తీసుకువ‌స్తోంది. ఈ ఫోన్‌తో మ‌రింత‌ నాణ్యమైన సెల్ఫీలు తీసుకోవ‌చ్చు.
 
ఈ స్మార్ట్‌ఫోన్ ఫీచ‌ర్‌లు ఇలా ఉన్నాయి..
* 5.5 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లే
* 1.5 గిగాహెర్జ్‌ ప్రాసెసర్‌
* 4 జీబీ ర్యామ్‌
* ఫ్రంట్ కెమెరా 20 మెగాపిక్సల్స్‌
* వెనక కెమెరా 13 మెగాపిక్సల్‌
* 32 జీబీ అంతర్గత మెమొరీతో పాటు 128 జీబీ వరకు పెంచుకునే సౌలభ్యం
* 3000 ఎంఏహెచ్‌ బ్యాటరీ సామ‌ర్థ్యం.

More Telugu News