: ఆ రెండు రోజుల్లో 4 టన్నుల బంగారం విక్రయించారు!

గత ఏడాది నవంబర్ 8న నోట్ల రద్దు ప్రకటన వెలువడిన తర్వాత, కేవలం నలభై ఎనిమిది గంటల్లో 4 టన్నులకు పైగా బంగారాన్ని వ్యాపారులు విక్రయించారట. దీని విలువ రూ.1,250 కోట్లకు పైగా ఉంటుందని సమాచారం. ఈ విషయం డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సెంట్రల్ ఎక్స్ఛేంజ్ ఇంటెలిజన్స్ (డీజీసీఈఐ) జరిపిన సర్వేలో వెల్లడైంది. నోట్ల రద్దు ప్రకటన వెలువడిన రోజునే దాదాపు రెండు టన్నుల బంగారం కొనుగోళ్లు జరిగాయని తెలిసింది.

ఢిల్లీకి చెందిన ఒక పెద్ద నగల వ్యాపార సంస్థ పెద్దమొత్తంలో బంగారాన్ని విక్రయించిందని, 45 కిలోల బంగారాన్ని 700 మంది వినియోగదారులకు అమ్మినట్టు ఈ సర్వేలో బయటపడింది. నోట్ల రద్దుకు ముందుతో పోలిస్తే సదరు వ్యాపారి జరిపిన విక్రయాలు కేవలం గ్రాముల్లోనే ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. రద్దయిన నోట్లను బంగారంలోకి మార్చుకోవడానికి దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో మనీ లాండరింగ్ కార్యకలాపాలు విపరీతంగా జరుగుతున్నాయని డీజీసీఈఐ పేర్కొంది.

 

More Telugu News