trump: కంప్యూట‌ర్లపై విమ‌ర్శ‌లు... వాటిపై ఆధార పడబోన‌ని తేల్చి చెప్పేసిన డొనాల్డ్ ట్రంప్‌

అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కంప్యూట‌ర్‌ల‌ను న‌మ్మ‌బోన‌ని చెబుతున్నారు. ఓ వైపు ప్ర‌పంచమంతా కంప్యూట‌ర్‌ల‌ను న‌మ్ముకొనే ప‌నులు చేసుకుంటుంటే మ‌రోవైపు ట్రంప్ కంప్యూట‌ర్‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు. తాజాగా కంప్యూట‌ర్‌ల గురించి స్పందించిన ట్రంప్‌... ఏ కంప్యూటర్‌ కూడా సురక్షితమైనది కాదని వ్యాఖ్యానించారు. అందుకే తాను కంప్యూటర్‌ను నమ్మన‌ని చెప్పారు. అందులో సమాచారాన్ని రహస్యంగా ఉంచ‌లేమ‌ని అనుమానం వ్య‌క్తం చేశారు. ఆన్‌లైన్‌ కమ్యూనికేషన్‌ భద్రతపై త‌న‌కు నమ్మకం లేదని చెప్పారు. అమెరికా అధ్య‌క్షుడిగా ప్ర‌మాణ స్వీకారం చేసిన త‌రువాత‌ తన పాలనలో రోజువారీ కార్యకలాపాల నుంచి మొదలుకొని, అంతర్జాతీయ సంబంధాల వరకు కంప్యూటర్లపై ఆధారపడబోన‌ని తేల్చి చెప్పారు.

More Telugu News