agni--4: అగ్ని-4 క్షిపణి ప్రయోగం స‌క్సెస్‌... లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించిన క్షిపణి

ఒడిశాలోని బాలాసోర్‌లో ఉన్న అబ్దుల్ కలాం వీలర్ ఐలాండ్ నుంచి ఈ రోజు ఉద‌యం అగ్ని-4 క్షిప‌ణి పరీక్షను నిర్వహించారు. నాలుగు వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఈ క్షిపణి సునాయాసంగా ఛేదించింద‌ని ఈ పరీక్ష విజ‌య‌వంతం అయ్యాక డీఆర్‌డీవో శాస్త్ర‌వేత్త‌లు ప్ర‌క‌టించారు. ఈ క్షిపణికి వెయ్యి కిలోల పేలోడ్‌ను మోసుకెళ్లగల సామర్థ్యం ఉందని శాస్త్ర‌వేత్త‌లు తెలిపారు.

More Telugu News