elephant: గొయ్యిలో పిల్ల ఏనుగు... పైకి రావడానికి పడరాని పాట్లు

ఛత్తీస్‌గ‌ఢ్‌లోని సూరజ్‌పూర్‌లో ఓ గొయ్యిలో ప‌డిపోయిన పిల్ల ఏనుగు పైకి రావ‌డానికి అష్ట‌క‌ష్టాలు ప‌డుతోంది. స్థానికులు త‌మ‌ అవ‌స‌రార్థం ఆ గొయ్యిని త‌వ్వుకున్న‌ట్లు తెలుస్తోంది. ఆ గొయ్యిలో పిల్ల ఏనుగును గ‌మ‌నించిన స్థానికులు వెంట‌నే అటవీశాఖ అధికారులకు స‌మాచారం అందించారు. ఆ గొయ్యి వ‌ద్ద‌కు చేరుకున్న అధికారులు ఏనుగును అందులో నుంచి బయటకు తీసేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

More Telugu News