whatsapp: భారీగా షేర్ అవుతున్న వైరస్... వాట్సప్ యూజర్లకు కేంద్ర భద్రతా ఏజెన్సీల హెచ్చరిక

సోషల్ మీడియా దిగ్గజం వాట్సప్ ద్వారా భార‌త్‌లో రెండు సంచ‌ల‌నాత్మక  వైరస్ ఫైల్స్ విప‌రీతంగా షేర్ అవుతున్నాయ‌ని కేంద్ర భద్రతా ఏజన్సీలు వినియోగ‌దారుల‌ను హెచ్చ‌రిస్తున్నాయి. అప్ర‌మ‌త్తంగా ఉండ‌క‌పోతే ప్ర‌మాద‌మేన‌ని చెబుతున్నాయి. ఈ యాప్ ద్వారా ఎన్డీఏ,(నేషనల్ డిఫెన్స్ అకాడమీ),  ఎన్ఐఎ(నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ) పేరుతో ప్ర‌మాదక‌ర‌మైన వైర‌స్‌ను జోడిస్తూ ఈ పైల్స్‌ను పంపుతున్నార‌ని కేంద్ర భద్రతా ఏజన్సీలు చెప్పాయి. ఈ ఫైల్స్ ప్ర‌ధానంగా డిఫెన్స్ , సెక్యూరిటీ పారా మిలీటరీ, పోలీస్ విభాగంలోని సిబ్బందిని టార్గెట్ చేస్తూ వ‌స్తున్నాయ‌ని తెలిపాయి. దీంతో రక్షణ, భద్రతా సంస్థలు మ‌రింత అల‌ర్ట్‌గా ఉండాల్సిన అవ‌స‌రం ఉంద‌ని చెప్పాయి.

ఈ వైర‌స్‌ను ఎక్స్ ఎల్ ఫార్మాట్  లో ఉన్న ఫైల్ లో పంపుతున్నార‌ని కేంద్ర భద్రతా ఏజన్సీలు తెలిపాయి. ఈ వైర‌స్ స్మార్ట్‌ఫోన్‌లోకి చేరితే ఫోన్‌లోని యూజర్ల వ్యక్తిగత సమాచారం స‌హా మొబైల్‌ బ్యాంకింగ్ వివ‌రాలు హ్యాక‌ర్ల చేతికి వెళ్లిపోతాయ‌ని హెచ్చ‌రించాయి. ఈ వైరస్ మెసేజ్ ల ద్వారా యూజ‌ర్ల‌ బ్యాంకింగ్ పాస్ వర్డ్స్, పిన్‌ తదితర వివరాలను కొట్టేస్తార‌ని చెప్పాయి. ఎక్స్ ఎల్ ఫార్మాట్ల‌లోనే కాక‌ ఎంఎస్ వర్డ్,  పీడీఎఫ్ ఫార్మాట్లలో కూడా ఉండ‌వ‌చ్చ‌ని యూజ‌ర్ల‌కు సూచించాయి.  ప్ర‌సిద్ధి చెందిన సంస్థల పేరుతో ఈ  మెసేజ్‌లు వ‌స్తున్నాయ‌ని చెప్పాయి. ఇటువంటి మెసేజ్‌లు వ‌స్తే యూజ‌ర్లు వెంటనే సంబంధిత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగాలకు స‌మాచారం అందించాల‌ని కేంద్ర భద్రతా ఏజన్సీలు సూచించాయి.

More Telugu News