veena-vaani: గుట్టుచప్పుడు కాకుండా నీలోఫర్ ఆసుప‌త్రి నుంచి స్టేట్‌హోమ్‌కు వీణా-వాణీల‌ త‌ర‌లింపు!

అవిభక్త కవలలు వీణా-వాణీల త‌ల్లిదండ్రులకు కూడా స‌మాచారం ఇవ్వ‌కుండా వారిని ఈ రోజు ఉదయం హైద‌రాబాద్‌లోని నీలోఫర్ ఆసుప‌త్రి నుంచి యూసఫ్‌గూడలోని స్టేట్‌హోమ్‌కు తరలించారు. ఆర్థిక ఇబ్బందుల కార‌ణంగా వీణా-వాణీలను వారి త‌ల్లిదండ్రులు వారి వెంట‌ తీసుకెళ్లేందుకు ఇప్ప‌టి వ‌ర‌కు ఒప్పుకోలేదు. దీంతో వీణా-వాణీలు 14 ఏళ్లుగా నీలోఫ‌ర్ ఆసుప‌త్రిలోనే ఉంటున్నారు. కొన్ని రోజుల క్రితం నీలోఫర్ ఆసుప‌త్రి వర్గాలు రాష్ట్ర స‌ర్కారుకి ఓ లేఖను రాసి, అందులో వారి పోషణ భారంగా ఉందని తెలిపిన‌ట్లు తెలుస్తోంది.

వీణా-వాణీల‌కు ఆప‌రేష‌న్‌ చేసినా ఫలితం తక్కువేనన్న అభిప్రాయంతో స‌ర్కారు వారికి ఆప‌రేష‌న్ నిర్వ‌హించ‌డానికి వెనక్కి తగ్గింది. దీంతో నీలోఫర్‌ నుంచి వారిని స్టేట్‌ హోమ్‌కు తరలించారు. వారిని ఆసుప‌త్రి నుంచి త‌ర‌లిస్తున్న క్ర‌మంలో వీణా-వాణీలు తాము ఆసుప‌త్రి నుంచి వెళ్ల‌బోమ‌ని వ్యాఖ్యానించారు. జీవితకాలం భద్రత కోసం వీణా-వాణీల‌ను తమకు ఆసుప‌త్రి వ‌ర్గాలు అప్పగించాయ‌ని స్టేట్‌ హోమ్‌ అధికారులు మీడియాకు తెలిపారు.

More Telugu News