: ఖండాంతర క్షిపణి సిద్ధమవుతోంది... ఎవరైనా వణకాల్సిందే: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ హెచ్చరిక

అణు ఆయుధాలను ఖండాలను దాటించేలా తాము తయారు చేస్తున్న క్షిపణి తుది దశకు చేరిందని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ వ్యాఖ్యానించారు. నూతన సంవత్సరం ప్రవేశించిన సందర్భంగా దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన ఆయన, బాలిస్టిక్ క్షిపణి తయారీ తయారవుతోందని, ఇక ఎవరైనా ఉత్తర కొరియాపై దాడులు చేయాలంటే వణికిపోవాల్సిందేనని ఆయన హెచ్చరించారు. దేశం అణు సామర్థ్యాన్ని పెంచుకుంటోందని తెలిపారు.

గత సంవత్సరం రెండుసార్లు అణు పరీక్షలు చేసి విజయవంతం చేశామని, క్లిష్ట పరిస్థితి ఎదురైతే, అణ్వాయుధాలతో యుద్ధం చేయగలమని ఆయన అన్నారు. మరింత దూరం ప్రయాణించే ఖండాంతర క్షిపణులపై దృష్టిని సారించినట్టు తెలిపారు. సైన్యానికి బలమైన ఆయుధాలను అందిస్తామని, ఇవి తమ ఆత్మ రక్షణకేనని చెబుతూనే అమెరికా పేరును ఆయన ప్రస్తావించారు. యూఎస్ వంటి దేశాన్ని ఎదుర్కోవాలంటే అణ్వస్త్రాలు తప్పనిసరని చెప్పారు.

More Telugu News