: శంకర్ సుబ్రమణియన్ కు నైట్ హుడ్ ప్రకటించిన బ్రిటన్

తదుపరి తరం డీఎన్ఏ ఎలా ఉంటుందన్న విషయంపై పరిశోధనలు చేస్తూ, అనుక్రమణాన్ని కనుగొన్న శాస్త్రవేత్తల్లో ఒకరైన భారత సంతతి బ్రిటన్ ప్రొఫెసర్ శంకర్ సుబ్రమణియన్ కు బ్రిటన్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక నైట్ హుడ్ హోదానిచ్చి సత్కరించింది. ఆయన కేంబ్రిడ్జ్ యూనివర్శిటీలో రసాయన శాస్త్ర విభాగంలో పనిచేస్తున్నారు. గతంలో మానవ జన్యు అనుక్రమణానికి బిలియన్ల కొద్దీ వ్యయం అవడంతో పాటు, కొన్నేళ్ల సమయం పట్టేది. అటువంటి స్థితిలో 'సొలెక్సా సీక్వెనింగ్'ను కనుగొని, అనుక్రమణాన్ని 1000 పౌండ్ల కన్నా తక్కువ ఖర్చుతో రెండు రోజుల్లో తయారు చేసే విధానాన్ని అందించిన సైంటిస్టుల్లో శంకర్ కూడా ఉన్నారు. ఆయన పరిశోధన బయో ఇన్ఫర్మాటిక్స్ పద్ధతిలో సాగి సత్ఫలితాలనిచ్చిందని బ్రిటన్ ప్రభుత్వం ఈ సందర్భంగా ఇచ్చిన ప్రశంసా పత్రంలో కొనియాడింది.

More Telugu News