: చైనా చారిత్రాత్మక నిర్ణయం... ఏనుగు దంతాల బిజినెస్ పై నిషేధం

ఏనుగు దంతాలతో వ్యాపారం అన్న పేరు వింటే గుర్తొచ్చేది చైనానే. ప్రపంచంలోనే ఏనుగు దంతాల వ్యాపారాన్ని అత్యధికంగా చేస్తున్న చైనా, కొత్త సంవత్సరం శుభవేళ చారిత్రాత్మక నిర్ణయాన్ని తీసుకుంది. వన్యప్రాణి సంరక్షకులకు అత్యంత ఆనందాన్ని కలిగిస్తూ, దంతాల వ్యాపారంపై చైనా ప్రభుత్వం నిషేధాన్ని విధించింది. ఈ సంవత్సరం ముగిసేలోగా ప్రభుత్వ నిర్ణయం దశలవారీగా అమలవుతుందని జిన్హువా వార్తా సంస్థ పేర్కొంది. డిసెంబర్ నాటికి వాణిజ్య అవసరాల నిమిత్తం దంతాల శుద్ధి, విక్రయాలను నిలిపివేయనున్నట్టు పేర్కొంది. కాగా, చైనాలోని ఆఫ్రికన్ ఏనుగులు అంతరించే దశలో ఉన్నాయని, వాటి దంతాల కోసం జరుగుతున్న వ్యాపారాన్ని నిలపాలని చాలా కాలంగా ప్రజలు డిమాండ్ చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే.

More Telugu News