: ఏసుదాస్ కు పాదపూజ చేసిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం దంపతులు

గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం యాభై సంవత్సరాల సినీ ప్రస్థానం మరపురానిది. తన మధుర స్వరంతో ఎన్నో వేల పాటలు పాడి, అభిమానుల గుండెల్లో ‘బాలు’గా స్థిరపడిపోయిన ఆయన, మరో ప్రముఖ గాయకుడు ఏసుదాస్ కు పాదపూజ చేశారు. చెన్నైలోని ఆర్ కేవీ స్టూడియో (ఒకప్పటి విజయా గార్డెన్స్)లో నిన్న రాత్రి  ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏసుదాస్ కు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం దంపతులు శాస్త్రోక్తంగా పాదపూజ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఏసుదాస్ మాట్లాడుతూ, కచేరీలు మినహా తాను ఏ కార్యక్రమానికీ వెళ్లనని, అయితే, బాలు కోసమే ఈ కార్యక్రమానికి వచ్చానని చెప్పారు. బాలు మాట్లాడుతూ, ఏసుదాస్ తనకు గురువు, సోదరునితో సమానమని అన్నారు. తండ్రితో పాటు పాదపూజలో పాల్గొన్న బాల సుబ్రహ్మణ్యం కుమారుడు ఎస్పీ చరణ్ మాట్లాడుతూ, యాభై ఏళ్ల సినీ ప్రస్థానం సందర్భంగా తన తండ్రి గత ఆగస్టు నుంచి ప్రపంచయాత్రను ప్రారంభించారని, వచ్చే ఆగస్టు వరకు ఈ యాత్ర కొనసాగుతుందని చెప్పారు. కాగా, గాయకుడు ఏసు దాస్ వెంట ఆయన సతీమణి కూడా ఉన్నారు.

More Telugu News