: మరోసారి మసూద్ అజర్ కు వెన్నుదన్నుగా నిలిచిన చైనా

పాకిస్థాన్ కేంద్రంగా భారత్ లో నరమేధం సృష్టించాలని నిత్యమూ ప్రణాళికలు రూపొందిస్తుండే ఉగ్రవాది, జైషే మొహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటింపజేయాలన్న భారత ఆలోచనకు చైనా మరోసారి అడ్డుపడింది. మసూద్ ను ఉగ్రవాదిగా ప్రకటించాలన్న భారత పిటిషన్ కు ఐరాసలో చైనా అడ్డుచెప్పగా, దీన్ని ద్వంద్వ నాలుకల ధోరణిగా భారత్ అభివర్ణించింది. ఓ వైపు ఉగ్రవాద చర్యలతో ఇబ్బందులు పడుతూ కూడా చైనా ఇలా చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని విదేశాంగ శాఖ ప్రతినిధి వికాస్ స్వరూప్ వ్యాఖ్యానించారు. ఉగ్ర పోరులో చైనా రెండు నాలుకల ధోరణి అవలంబిస్తోందని ఆయన అన్నారు. కేవలం చైనా కారణంగానే మసూద్ తప్పించుకుంటున్నాడని, పాక్ పై ప్రపంచ దేశాలు ఒత్తిడి పెంచలేకపోతున్నాయని ఆయన అన్నారు. కాగా, సాంకేతిక కారణాలు అడ్డుపడుతున్నాయని కుంటి సాకులు చెబుతూ, మసూద్ ను ఉగ్రవాదని ప్రకటించకుండా, చైనా అడ్డుకుంటున్న సంగతి తెలిసిందే.

More Telugu News