: కొత్త సంవత్సరం వచ్చేస్తోంది... కిరిబాతిలో వేడుకలు మొదలు

కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ కిరిబాతి, సమోవా దీవుల్లో సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. మరికాసేపట్లో ఈ దీవులకు న్యూ ఇయర్ రానుంది. టైమ్ జోన్ ప్రకారం, ఈ దీవుల్లోనే మొట్టమొదట న్యూ ఇయర్ ప్రవేశిస్తుందన్న సంగతి తెలిసిందే. ఇక కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు న్యూజిలాండ్ సైతం సిద్ధమైంది. ఆపై జపాన్, ఆస్ట్రేలియా తదితర దేశాలు 2017 సంవత్సరానికి ముందుగా స్వాగతం పలికే దేశాల జాబితాలో ఉన్నాయి. ఇక కిరిబాతి దీవులకు పక్కనే ఉన్నప్పటికీ, హవాయ్ దీవుల్లో మాత్రం 24 గంటలు ఆలస్యంగా, అంటే భారత కాలమానం ప్రకారం రేపు ఉదయం తరువాతనే కొత్త సంవత్సరం వేడుకలు సాగనున్నాయి.

More Telugu News