: 2017లో రెండు సూర్యగ్ర‌హణాలు, రెండు చంద్ర‌గ్ర‌హ‌ణాలు.. భార‌త్‌లో క‌నిపించేది రెండే!

వ‌చ్చే ఏడాది నాలుగు  గ్ర‌హణాలు ప్ర‌జ‌ల‌కు ద‌ర్శ‌నం ఇవ్వ‌బోతున్నాయి. ఇందులో రెండు మాత్ర‌మే భార‌త్‌లో క‌నువిందు చేయ‌నున్నాయి. నాలుగింటిలో రెండు సూర్యగ్ర‌హణాలు కాగా, రెండు చంద్ర‌గ్ర‌హ‌ణాలు. చంద్ర‌గ్ర‌హ‌ణాలు మాత్ర‌మే భార‌త్‌లో క‌నిపిస్తాయ‌ని ఉజ్జ‌యినిలోని జివాజీ ప‌రిశోధ‌న సంస్థ పేర్కొంది. వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రి 11న చంద్ర‌గ్ర‌హ‌ణం, అదే నెల 26న సూర్య‌గ్ర‌హ‌ణం, ఆగ‌స్టు 7న పాక్షిక చంద్ర‌గ్ర‌హ‌ణం, అదే నెల 21న సంపూర్ణ సూర్య‌గ్ర‌హ‌ణం ఏర్ప‌డతాయని ఖ‌గోళ శాస్త్ర‌వేత్త‌లు వివ‌రించారు.  సూర్య గ్ర‌హణాలు భార‌త్‌లో క‌నిపించ‌వ‌ని పేర్కొన్నారు. ఒకే నెల‌లోనే సూర్య‌, చంద్ర‌గ్ర‌హ‌ణాలు ఏర్ప‌డుతుండ‌డం గ‌మ‌నార్హం.

More Telugu News