: ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ గుర్తింపును రద్దు చేసిన కేంద్రం

ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ గుర్తింపును తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్టు కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. సురేశ్‌ కల్మాడీ, అభయ్‌ సింగ్‌ చౌతాలా నియామకాలను ఉపసంహరించుకునే వరకూ అసోసియేషన్ ను సస్పెండ్ చేస్తున్నట్టు క్రీడా మంత్రి విజయ్ గోయల్ ప్రకటించారు. పలు కుంభకోణాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు వచ్చిన వీరిద్దరికీ, ఐఓఏలో చోటు కల్పించరాదని, తక్షణమే వారు రాజీనామా చేయాలని కేంద్ర ప్రభుత్వం సూచించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు బుధవారం షోకాజ్‌ నోటీసులు జారీ చేయగా, ఐఓఏ స్పందించకపోయేసరికి, ఆగ్రహించిన కేంద్రం, ఏకంగా గుర్తింపునే రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. క్రీడారంగంలో పారదర్శకత, జవాబుదారీతనం ఉండాల్సివుండగా, అందుకు కల్మాడీ, చౌతాల ఎంపిక జరిగిందని ఈ సందర్భంగా క్రీడా శాఖ అభిప్రాయపడింది. కాగా, నియామకాలకు సంబంధించి తాము ఎవ్వరి సూచనలను పాటించాల్సిన అవసరం లేదని భారత ఒలింపిక్‌ సంఘం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

More Telugu News