: ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ను పార్టీ నుంచి బహిష్కరించిన ములాయం సింగ్ యాదవ్

సమాజ్ వాదీ పార్టీలో సంక్షోభం ముదిరింది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ తో పాటు ఆయన బాబాయ్ రాంగోపాల్ యాదవ్ ను సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ పార్టీ నుంచి బహిష్కరించారు. ఆరేళ్ల పాటు వారిద్దరిని బహిష్కరిస్తున్నట్టు ఆయన ప్రకటించారు. అవసరమైతే అఖిలేష్ యాదవ్ ను తప్పించి ముఖ్యమంత్రి స్థానంలో వేరొకరిని కూర్చోబెడతామని ఆయన పేర్కొనడం కలకలం రేగుతోంది. కాగా, పార్టీని సంప్రదించకుండా అఖిలేష్ యాదవ్ అభ్యర్థుల జాబితా ప్రకటించారని, దానిని తీవ్రంగా పరిగణించి ఆయనపై చర్యలు తీసుకుంటున్నానని ములాయం తెలిపారు.

కాగా, అఖిలేష్ విడుదల చేసిన జాబితాలో వున్న 186 మందికి ములాయం సింగ్ యాదవ్ తన జాబితాలో స్థానం కల్పించడం విశేషం. ఇదే జాబితాలో తన బాబాయి శివపాల్ యాదవ్ రికమండేషన్ తో, కరుడుగట్టిన గ్యాంగ్ స్టర్, 44 కేసుల్లో ప్రధాన నిందితుడైన వ్యక్తికి సీటివ్వడాన్ని అఖిలేష్ తీవ్రంగా వ్యతిరేకిస్తుండడం ఆ పార్టీలో ముసలానికి కారణమైనట్టు తెలుస్తోంది. దీంతో సమాజ్ వాదీ పార్టీ చీలిపోయే అవకాశం కనిపిస్తోంది. దీనిని అవకాశంగా తీసుకునేందుకు ఇతర పార్టీలన్నీ వ్యూహాల్లో నిమగ్నమైనట్టు తెలుస్తోంది. 

More Telugu News