: నేనేం చేయగలనో అదే చేస్తా... ఎవరి గురించో నేనెందుకు చెప్పాలి?: కేఏ పాల్

క్రైస్తవం పేరుతో ప్రజలను ఎవరో తప్పుదోవ పట్టిస్తే వారి గురించి తానెందుకు స్పందించాలని క్రైస్తవ మత బోధకుడు కేఏ పాల్ ప్రశ్నించారు. ఓ టీవీ చానెల్ తో కేఏ పాల్ మాట్లాడుతూ, బైబిల్ లో ఉన్నది ఉన్నట్టు చెప్పడం తన పని అన్నారు. బైబిల్ సారాంశం అందరికీ చేరాలని.. త్యాగం, అహింస, జీవన విధానం గురించి క్రీస్తు చెప్పిన సందేశాన్ని వివరిస్తానని చెప్పారు. ఈ సందర్భంగా 'కొంత మంది క్రైస్తవ మతబోధకులు ప్రార్థనలతో రోగాలు నయం చేస్తారట, వర్షాలు కురిపిస్తారట, బ్రదర్ అనిల్ అయితే వర్షం కురిపిస్తానంటున్నారు... ఇవన్నీ వాస్తవమా?' అని యాంకర్ ప్రశ్నించగా... కేఏ పాల్ సమాధానమిస్తూ, దానికి తానెలా సమాధానం చెప్పగలనని అన్నారు. ఆయన చేస్తానన్నప్పుడు ఆయననే అడగాలని ఆయన సూచించారు.

దీంతో యాంకర్ మళ్లీ కల్పించుకుని అంటే 'వాళ్లు ప్రజలను మోసం చేస్తున్నారని మీరు చెబుతున్నారా?' అని మళ్లీ ప్రశ్న సంధించగా... కేఏ పాల్ సమాధానమిస్తూ, ఎవరో ఏదో చేస్తే దానికి తీర్పు చెప్పేందుకు తానెవరినని అన్నారు. తానేం చేస్తానో, తానేం చేయగలనో అదే ప్రజలకు చెబుతానని, వేరెవరి గురించో తాను చెప్పలేనని ఆయన అన్నారు.  

More Telugu News