narayana: పనులు చేయకపోతే అంతే.. వెయ్యి మంది కాంట్రాక్టర్లకు నోటీసులు: మ‌ంత్రి నారాయ‌ణ‌

రాష్ట్రంలోని మున్సిపాలిటీల్లో టెండ‌ర్లు వేసి ప‌నులు చేయ‌కుండా నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తోన్న కాంట్రాక్టర్ల‌ను ఉపేక్షించ‌డం లేద‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ పుర‌పాల‌క శాఖ మంత్రి నారాయ‌ణ చెప్పారు. ఈ రోజు నెల్లూరు జిల్లాలో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ... నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించిన వెయ్యి మంది కాంట్రాక్టర్లకు ఇప్ప‌టికే నోటీసులు జారీచేసినట్టు చెప్పారు. అంతేగాక‌, టెండర్లు వేసి పనులు చేయని వారిని బ్లాక్‌లిస్ట్‌లో పెడతామని తెలిపారు.

నెల్లూరులో సాగునీటి సలహా మండలి తీర్మానం మేరకే నీటిని విడుదల చేస్తామ‌ని నారాయ‌ణ చెప్పారు. ప్ర‌జ‌లు త‌మ‌కు ల‌భిస్తోన్న నీటిని జాగ్రత్తగా వాడుకోవాలని ఆయ‌న సూచించారు. అక్ర‌మాస్తులు ఉన్నాయంటూ త‌మ పార్టీ నేత‌ సోమిరెడ్డిపై వైసీపీ ఎమ్మెల్యే కాకాని చేసిన ఆరోపణల్లో వాస్తవంలేదని ఆయ‌న తెలిపారు. ఆ ఆరోప‌ణ‌ల్లో నిజం ఉంటే కాకాని రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాలని, విచార‌ణ జ‌రిపిస్తామ‌ని ఆయ‌న సూచించారు.

More Telugu News