: ద్రవిడ్, లక్ష్మణ్ లే మేటి క్రికెటర్లు: పాక్ పేసర్ మహ్మద్ ఆసిఫ్

కొత్త బంతితో తన కంటే మెరుగ్గా బౌలింగ్ చేయగల బౌలర్ లేడని ఈ మధ్యే ప్రకటించిన పాకిస్థాన్ పేసర్ మహ్మద్ ఆసిఫ్ టీమిండియా దిగ్గజాలపై ప్రశంసలు కురిపించాడు. స్పాట్ ఫిక్సింగ్ కు పాల్పడి, ఐదేళ్ల నిషేధానికి గురైన ఈ పేసర్ మళ్లీ అంతర్జాతీయ క్రికెట్ లో పునరాగమనానికి ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలో మాట్లాడుతూ, తన కెరీర్ లో ఎదుర్కొన్న అంత్యంత కఠినమైన బ్యాట్స్ మన్ రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్ లేనని చెప్పాడు. ఈ ఇద్దరిదీ అంత్యత నాణ్యమైన సాంకేతికత అని చెప్పాడు. ఈ ఇద్దరికీ బౌలింగ్ చేయడం సవాల్ అన్నాడు. ప్రధానంగా వీరికి ఆఫ్ సైడ్ బంతులేయాలంటే తీవ్రంగా శ్రమించాల్సిందేనని అన్నాడు. వారిద్దరికీ ఆఫ్ స్టంప్ పై బంతి వేయాలంటే కష్టంగా ఉండేదని చెప్పాడు. ప్రస్తుత టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా సాంకేతికంగా అత్యుత్తమ ఆటగాడని కితాబునిచ్చాడు. అతనికి బౌలింగ్ చేయాలంటే ఏ బౌలర్ అయినా శ్రమించాల్సిందేనని చెప్పాడు. 

More Telugu News