trump: ఈ అంశాన్ని ఇంతటితో వదిలేయాలి: ఎన్నికల నేపథ్యంలో రష్యా జోక్యంపై డొనాల్డ్ ట్రంప్

అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రస్తుతం క్రిస్మస్‌, నూతన సంవత్సర వేడుకల సంద‌ర్భంగా ఫ్లొరిడాలోని మార్‌ ఎ లాగో రిసార్ట్‌లో గ‌డుపుతున్నారు. అక్క‌డే ఆయన తన కార్యనిర్వాహక టీమ్ ఎంపికల కోసం ఇంటర్వ్యూలు నిర్వహిస్తూ బిజీగా ఉన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ అమెరికా ఎన్నిక‌ల నేప‌థ్యంలో ర‌ష్యా జోక్యంపై స్పందించారు. కంప్యూటర్ల హ్యాకింగ్‌ వ్యవహారంలో త‌మ‌దేశ‌ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీలను ఆయ‌న‌ తప్పుబట్టారు. ఈ వివాదం నుంచి రష్యా, అమెరికాలను దూరంగా ఉంచాలని వ్యాఖ్యానించారు.

అయినా, ఈ అంశాన్ని ఇంతటితో వదిలేయాల‌ని అన్నారు. త‌మ ప్ర‌త్య‌ర్థి పార్టీ అయిన‌ డెమొక్రటిక్ నేత‌ల‌కు సంబంధించిన‌ కంప్యూటర్లు, వ్యక్తుల నుంచి సమాచారం సేకరించి ర‌ష్యా హ్యాక‌ర్లు తనకు మద్దతుగా ఆన్‌లైన్‌లో పోస్టు చేశార‌న్న అమెరికా ఇంటెలిజెన్స్ నివేదికలపై ట్రంప్ మరోసారి అనుమానం వ్యక్తం చేశారు. మ‌నుషుల‌ జీవితాల్ని కంప్యూటర్లు మ‌రింత‌ జటిలం చేశాయని వ్యాఖ్యానించారు. ఒక కంప్యూటర్‌ జీవితకాలంలో ఎలా ఉంటుందో ఎవ‌రికి తెలుస‌ని అన్నారు.

More Telugu News