chandrababu: నగదురహిత లావాదేవీలకు భద్రతా సమస్యలు ఉన్నాయి.. పరిష్కారాలు కూడా ఉన్నాయి: ఢిల్లీలో చంద్రబాబు

న‌గ‌దుర‌హిత లావాదేవీల‌పై ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడి అధ్య‌క్ష‌త‌న ఢిల్లీలో ఈ రోజు ఉద‌యం నుంచి కొన‌సాగుతున్న భేటీ ముగిసింది. అనంత‌రం చంద్ర‌బాబు నాయుడు మీడియాతో మాట్లాడుతూ... మొబైల్ లావాదేవీలపై అందరూ ఆస‌క్తిచూపాలని కోరారు. డిజిట‌ల్ లావాదేవీల‌పై ఫ‌ల‌వంత‌మైన చ‌ర్చ జ‌రిగిందని చెప్పారు. డిమాండుకి అనుగుణంగా స్వైపింగ్ మిష‌న్‌ల స‌ర‌ఫ‌రాకు కేంద్ర ప్ర‌భుత్వం కృషి చేస్తోంద‌ని, పీవోఎస్ యంత్రాలు పంపుతున్నామ‌ని చెప్పారు. డిజిట‌ల్ లావాదేవీల్లో ఆధార్ నెంబ‌రు కీల‌కం కానుందని చంద్ర‌బాబు అన్నారు. న‌గ‌దుర‌హిత లావాదేవీల కోసం ప్రోత్సాహకాలు కూడా ప్ర‌క‌టిస్తున్న‌ట్లు చెప్పారు.

ఇప్పటి వరకు దేశంలో నాలుగు బ్యాంకులే ఆధార్ ఆధారిత చెల్లింపుల‌కు అవకాశం ఇస్తున్నాయని, దేశంలోని అన్ని బ్యాంకులు ఈ విధానాన్ని ప్రోత్సహిస్తూ ముందుకు రావాలని చంద్రబాబు నాయుడు సూచించారు. వివిధ దేశాల్లో సమర్థవంతంగా కొనసాగుతున్న డిజిటల్ లావాదేవీలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. నగదురహిత లావాదేవీల వైపుకు దేశం మళ్లుతుందని ఆయన అన్నారు. సైబర్ భద్రతపై అందరి కన్నా మన దేశం ముందుందని చెప్పారు. నగదురహిత లావాదేవీలకు భద్రతా సమస్యలు ఉన్నాయని, పరిష్కార మార్గాలు కూడా ఉన్నాయని అన్నారు.
 

More Telugu News