police complint: మా నాయనమ్మ నన్ను ఆడుకోనివ్వ‌డం లేదు: హైదరాబాదులో రాత్రిపూట పోలీస్ స్టేష‌న్‌కు వ‌చ్చి ఫిర్యాదు చేసిన నాలుగేళ్ల చిన్నారి!

త‌న‌ను త‌న‌ నాయనమ్మ బయట ఆడుకోనివ్వడం లేదంటూ ఓ నాలుగేళ్ల బాలుడు పోలీసుల‌కి ఫిర్యాదు చేసిన ఘ‌ట‌న హైద‌రాబాద్‌లోని ఎస్సార్ న‌గ‌ర్ పోలీస్ స్టేష‌న్‌లో చోటుచేసుకుంది. నిన్న రాత్రి 9.30 గంట‌ల‌కు ఈ బాలుడు ఒంట‌రిగా పోలీస్ స్టేష‌న్‌కు రావ‌డం గ‌మ‌నార్హం. త‌న‌ను అతి కొద్ది సేపు మాత్ర‌మే ఆడుకోవాలంటూ ఆమె త‌న‌ను హింసిస్తోందని, ఆమెను అరెస్టు చేయాల‌ని ఆ చిన్నారి పోలీసుల‌ను కోరాడు. ఆమెపై కేసు పెట్టాలని పోలీసుల‌ను ఇబ్బంది పెట్టాడు.

ఈ ఘ‌ట‌న‌పై స‌ద‌రు పోలీసు స్టేషన్‌ ఎస్‌హెచ్‌వో మీడియాతో మాట్లాడుతూ... ఆ పిల్లాడి తండ్రి ఓ కేబుల్‌ ఆపరేటర్ అని చెప్పారు. టీవీ సీరియళ్ల ప్రభావంతోనే ఆ చిన్నారి పోలీసు స్టేషన్‌కు వచ్చి ఉంటాడని, ఆ పిల్లాడికి చివ‌రికి న‌చ్చ‌జెప్పామ‌ని అన్నారు. ఈ క్రమంలో ఆ పిల్లాడికి పోలీసులు ఎన్నో చాక్లెట్లు కొనివ్వాల్సి వ‌చ్చింది. అనంత‌రం ఆ పిల్లాడి తల్లిదండ్రులను పోలీసులు స్టేషన్‌కు తీసుకువ‌చ్చి వారికి కౌన్సెలింగ్‌ ఇచ్చి పంపించారు.

More Telugu News