salman khan: ‘సల్మాన్‌’ యాప్‌ విడుదల.. దీని ద్వారా ‘బీయింగ్‌ హ్యూమన్‌’లో ఆకర్షణీయమైన డిస్కౌంట్‌లు కూడా

బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ ఈ రోజు త‌న‌ 51వ పుట్టిన‌రోజు వేడుక‌ల‌ను జ‌రుపుకుంటున్నాడు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న త‌న‌ పర్సనల్ యాప్ ను విడుదల చేశాడు. ‘బీయింగ్‌ ఇన్‌ టచ్‌’ పేరుతో ఈ యాప్‌ను త‌న అభిమానుల ముందుకు తీసుకువ‌చ్చాడు. ఈ విషయాన్ని ఆయ‌న త‌న‌ ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపాడు. ఈ యాప్ ద్వారా తన అభిమానులతో ఎప్పటికప్పుడు ప‌లు విషయాలను పంచుకోనున్నాడు. ఈ యాప్‌ ద్వారా అభిమానులకు చేరువగా ఉంటానని ట్విట్ట‌ర్ లో పేర్కొన్నాడు. అంతేగాక‌, ఈ యాప్‌ ద్వారా వినియోగదారులకు ‘బీయింగ్‌ హ్యూమన్‌’లో ఆకర్షణీయమైన డిస్కౌంట్‌లు కూడా ల‌భించ‌నున్న‌ట్లు స‌మాచారం. సల్మాన్ ఖాన్‌ ప్రస్తుతం ‘ట్యూబ్‌లైట్‌’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ మూవీ కబీర్‌ ఖాన్‌ దర్శకత్వంలో తెర‌కెక్కుతోంది.

More Telugu News