demonitization: ఫైనాన్షియ‌ర్ కిశోర్ భ‌జియావాలా కుటుంబానికి మొత్తం 56 బ్యాంకు ఖాతాలు

గుజ‌రాత్‌లోని సూర‌త్‌కి చెందిన ఫైనాన్షియ‌ర్ కిశోర్ భ‌జియావాలాకు చెందిన ఆస్తులపై ఇటీవ‌లే దాడులు నిర్వ‌హించిన ఆదాయపన్ను శాఖ అధికారులు అత‌డి నుంచి ఏకంగా భారీగా న‌గ‌దు, బంగారం స్వాధీనం చేసుకున్న విష‌యం తెలిసిందే. త‌నిఖీలు జ‌రు‌పుతున్న అధికారులే ఆశ్చ‌ర్యానికి గుర‌య్యేలా ఆయ‌న చేసిన అవినీతి బ‌య‌ట‌ప‌డుతోంది. సోదాల్లో భాగంగా తాజాగా అధికారులు భజియావాలా కుటుంబం వివిధ బ్యాంకుల్లో 56 ఖాతాలను నిర్వహిస్తున్నట్లు తెలుసుకున్నారు.  ఈ విష‌యాన్ని తాము న‌మోదు చేసిన‌ ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. ఆయ‌న కుటుంబానికి చెందిన వ్య‌క్తులకి ప్రైవేటు బ్యాంకుల్లో 16, జాతీయ బ్యాంకుల్లో 13, సూరత్‌ పీపుల్‌ కో ఆపరేటివ్‌ బ్యాంక్‌లో 27 ఖాతాలు ఉన్న‌ట్లు పేర్కొన్నారు. ఈ కేసులో కిశోర్‌ భజియావాలాతో పాటు అతని ఇద్దరు కుమారులు, పీపుల్స్‌ బ్యాంక్‌ సీనియర్‌ మేనేజర్‌ పంకజ్‌ భట్‌లపై కేసులు నమోదు చేసి ద‌ర్యాప్తు కొన‌సాగిస్తున్న‌ట్లు అధికారులు చెప్పారు.

More Telugu News