: ఇక లాటరీ పద్ధతిలో డబుల్ బెడ్ రూం ఇళ్లు: కేసీఆర్ కీలక ప్రకటన

డబుల్ బెడ్ రూం ఇళ్లకు లబ్ధిదారుల ఎంపికలో మరింత పారదర్శకమైన విధానాన్ని పాటిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఈ మధ్యాహ్నం అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. పేదలకు ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకే ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టామని, ఇకపై లాటరీ విధానంలో లబ్ధిదారులను ఎంపిక చేస్తామని చెప్పారు. గత ప్రభుత్వాల హయాంలో 2004 నుంచి 2014 మధ్య ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో అవకతవకలపై 225 క్రిమినల్ కేసులు నమోదయ్యాయని గుర్తు చేశారు. కాంగ్రెస్ హయాంలో పలు అవకతవకలు జరిగాయని, పాలకులు, అధికారులు ఏకమై ప్రజలను దోచుకున్నారని ఆరోపించారు. 1.95 లక్షల మంది అనర్హులకు ఇళ్లు దక్కాయని తేలిందని తెలిపారు. తాము 1.19 లక్షల మంది బోగస్ లబ్ధిదారులను గుర్తించామని పేర్కొన్నారు. తాము అధికారంలోకి రాకముందు మంజూరైన ఇళ్లకు కూడా బిల్లులను చెల్లిస్తున్నామని గుర్తు చేశారు.

More Telugu News