: అమ్మ లేక అనాధగా మారిన తమిళనాడు... అన్నాడీఎంకే పరిస్థితి ఏంటి?: రామ్మోహన్ రావు

అమ్మ జయలలిత మరణంతో తమిళనాడు రాష్ట్రం అనాధగా మారిందని, రాష్ట్రానికి చీఫ్ సెక్రటరీపైనే అరాచకం జరిగిందంటే, సామాన్య అన్నాడీఎంకే కార్యకర్తల పరిస్థితి ఏంటని మాజీ సీఎస్ రామ్మోహన్ రావు ప్రశ్నించారు. ఈ ఉదయం ఆసుపత్రి నుంచి విడుదలైన ఆయన మీడియాతో మాట్లాడుతూ, తనపై జరిగిన ఐటీ దాడులకు, కేంద్రాన్ని, తమిళనాడు ప్రభుత్వ పెద్దలను బాధ్యులను చేసే ప్రయత్నం చేశారు.

 దివంగత సీఎం జయలలితపై పొగడ్తల వర్షం గుప్పిస్తూ, తనకు ఆమెతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ, ఆమె లేకపోవడం వల్ల రాష్ట్రంలో పాలన కుంటుపడిందని, ప్రజలకు సంక్షేమం దూరమైందని ఆరోపించారు. తన విషయంలో మోదీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని ఉల్లంఘించిందని విమర్శించారు. తాను ఎన్నో ఏళ్లుగా అమ్మ వెంట నడుస్తూ వచ్చానని, ఇకపైనా ఆమె చూపిన దారిలోనే నడుస్తానని చెప్పారు. మూడు దశాబ్దాలకు పైగా సేవచేసిన తనకు పట్టిన ఈ గతిని చూసి, ఇతర ఐఏఎస్ అధికారులు ఆందోళన చెందుతున్నారని చెప్పారు. తనకేదైనా జరిగితే, అందుకు కేంద్ర ప్రభుత్వానిదే బాధ్యతని హెచ్చరించారు.

More Telugu News