: ఏటీఎం దొంగ‌ల నుంచి రూ.1.09 కోట్ల నగదు స్వాధీనం.. మొత్తం 80 ఏటీఎంలలో చోరీ!

హైదరాబాద్‌లోని స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా శాఖ‌కు చెందిన ఏటీఎంలలో డ‌బ్బును పెట్ట‌డానికి వెళ్లిన ప్రైవేటు ఏజెన్సీ సిబ్బంది అదే డ‌బ్బుతో పారిపోయిన సంగ‌తి తెలిసిందే. వారి కోసం గాలించిన పోలీసులు ఎట్ట‌కేల‌కు వారిని అదుపులోకి తీసుకొని వారి నుంచి రూ.1.09 కోట్ల నగదుతో పాటు రూ.2 లక్షల విలువచేసే బంగారు నగలు, రెండు ఇళ్ల స్థలాలకు సంబంధించిన ప‌త్రాల‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు గురించి సీసీఎస్‌ డీసీపీ అవినాష్ మాట్లాడుతూ... ట్రాన్స్‌ ట్రీజర్‌ సర్వీసెస్‌ సంస్థ ప్రతినిధి ఇచ్చిన ఫిర్యాదుతో ఈ కేసులో ద‌ర్యాప్తు కొన‌సాగించామ‌ని, ఈ కేసులో తాము స‌ద‌రు ప్రైవేటు సంస్థ మేనేజరుతో పాటు మ‌రో ఐదుగురిని అరెస్టు చేసినట్టు తెలిపారు. తాము అదుపులోకి తీసుకున్న వారంతా ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం 80 ఏటీఎంల నుంచి సుమారు రూ.1.88 కోట్లు కాజేశార‌ని ఆయ‌న పేర్కొన్నారు.

More Telugu News