: తమిళ నటుడు ప్రభు జన్మదిన వేడుకల్లో రజనీ, కమల్!

ప్రముఖ తమిళ నటుడు ప్రభు తన 60వ పడిలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా జరిగిన పుట్టినరోజు వేడుకలకు తమిళ సినీ రంగానికి చెందిన పలువురు నటులు, ప్రముఖులు హాజరయ్యారు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, విలక్షణ నటుడు కమలహాసన్ కూడా ఈ వేడుకలకు హాజరై ప్రభుకు శుభాకాంక్షలు తెలిపారు. కాగా, ప్రముఖ నటుడు శివాజీగణేశన్ తనయుడు అయిన ప్రభు, 1982 లో ‘సంగిలి’ చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమయ్యాడు. తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ చిత్రాల్లో నటించిన ప్రభు దక్షిణాది నటుడిగా మంచి పేరు సంపాదించుకున్నాడు. 

More Telugu News