: బ్లాక్ బ్యాట్ పై నిషేధం విధించిన క్రికెట్ ఆస్ట్రేలియా

ఆస్ట్రేలియాలో అత్యంత పాప్యులర్ అయిన బిగ్ బాష్ లీగ్ లో బ్లాక్ కలర్ బ్యాట్లను వాడకూడదంటూ క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ఆదేశించింది. గతంలో, ఆటగాళ్ల డ్రెస్ కోడ్ ను బట్టి బ్యాట్ కలర్ కూడా ఉండవచ్చని చెప్పిన క్రికెట్ ఆస్ట్రేలియా... తాజాగా తన నిర్ణయాన్ని మార్చుకుంది. బిగ్ బాష్ లీగ్ ఆరంభపు మ్యాచ్ లో సిడ్నీ థండర్స్ తరపున విండీస్ ఆటగాడు ఆండీ రస్సెల్స్ బ్లాక్ బ్యాట్ తో క్రీజులోకి వచ్చాడు. ఆ తర్వాత, బ్లాక్ బ్యాట్ వల్ల బాల్ కలర్ దెబ్బతింటోందని... నల్లటి మరకలు పడుతున్నాయని అధికారులు నివేదిక అందించారు. దీంతో, బ్లాక్ బ్యాట్లను నిషేధిస్తున్నట్టు క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. గత బిగ్ బాష్ లీగ్ లో బంగారు పూత పూసిన బ్యాట్ ను విధ్వంసకర బ్యాట్స్ మెన్ క్రిస్ గేల్ వాడాడు. అప్పుడు ఆ బ్యాట్ ను తయారు చేసిన స్పార్టన్ కంపెనీనే... ఇప్పుడు బ్లాక్ బ్యాట్ ను తయారు చేసింది.

More Telugu News